Home South Zone Telangana రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం – టెన్త్‌ పాస్‌ వారికి గోల్డెన్‌ ఛాన్స్‌|

రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం – టెన్త్‌ పాస్‌ వారికి గోల్డెన్‌ ఛాన్స్‌|

0
1

రైల్వే శాఖలో క్రీడా కోటా కింద ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఈ పోస్టులకు అర్హత పొందడానికి అభ్యర్థులు సంబంధిత పోస్టు ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ లేదా డిగ్రీలో ఉత్తీర్ణులు కావాలి.

అంతేకాక, అభ్యర్థులు అథ్లెటిక్స్‌, రెజ్లింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌, కబడ్డీ, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి క్రీడల్లో పాల్గొనడమో, పతకాలు సాధించడమో చేసి ఉండాలి.

జనవరి 1, 2026 నాటికి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత గల అభ్యర్థులు 2025 నవంబర్‌ 10లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.500 కాగా, SC, ST, మహిళలు, మైనారిటీలు, దివ్యాంగులు, EBC వర్గాలకు రూ.250గా నిర్ణయించారు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అభ్యర్థుల విద్యార్హత, క్రీడా ప్రతిభ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ట్రయల్స్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి జీతభత్యాలతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు అందించబడతాయి.

NO COMMENTS