Home South Zone Andhra Pradesh తిరుపతి అడవుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన – ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యం|

తిరుపతి అడవుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన – ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యం|

0

ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. కాన్వాయ్‌ను వదిలి కాలినడకన అడవిలో నాలుగు కిలోమీటర్ల మేర విహరించి, చెట్లు, మొక్కలను పరిశీలించారు.

ఎర్రచందనం, అరుదైన వృక్షజాతుల గురించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
స్మగ్లింగ్ నియంత్రణపై టాస్క్‌ఫోర్స్ పనితీరును సమీక్షించి, అటవీ రక్షణ చర్యలపై సూచనలు ఇచ్చారు. వాచ్‌టవర్‌ ఎక్కి అటవీ ప్రాంతాన్ని వీక్షించిన పవన్, గుంటి మడుగు వాగు వద్ద కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.

అనంతరం మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. మంగళంలోని ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించి, ప్రతి దుంగకు బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

NO COMMENTS

Exit mobile version