2026 సంక్రాంతి బరిలో ది రాజా సాబ్ (The Raja Saab), మన శంకరవరప్రసాద్ గారు , జన నాయకన్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
చిరంజీవి, విజయ్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ ఇప్పటికే విడుదలై ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మాత్రం ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలని మేకర్స్ పలుమార్లు ప్రయత్నించినా వాయిదా పడింది.
దీంతో రాజా సాబ్ ప్రమోషన్‌లో వెనుకబడిందని భావిస్తున్నారు. అయితే ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కావడంతో, పాటలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే సింగిల్స్ వరుసగా విడుదల చేయనున్నారని సమాచారం. పాన్‌ఇండియా స్థాయిలో విడుదలకానున్న ఈ చిత్రానికి వేగవంతమైన ప్రమోషన్ అవసరం ఉంది.




