రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవల తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన భక్తుల కోసం ఓ కీలక ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆధునిక వంటగదిని నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ వంటగది రోజుకు రెండు లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా రూపొందించబడనుంది. అత్యాధునిక ఆటోమేషన్ సాంకేతికతతో ఈ వంటశాల ఏర్పాటుకానుంది.
రిలయన్స్ ఫౌండేషన్ ఈ వంటగదిని శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌కు అంకితం చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన “అన్నసేవా సంప్రదాయ విస్తరణ” లక్ష్యానికి తోడ్పడతామని అంబానీ తెలిపారు.
ఈ ప్రయత్నం తిరుమలతో పాటు ఇతర టిటిడి ఆలయాలకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
తిరుమల సందర్శన అనంతరం ముఖేష్ అంబానీ కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లి రూ.5 కోట్లు విరాళంగా అందించారు. ఆయన ఈ చర్య భక్తి, సేవ మరియు సమాజానికి అంకితభావానికి చిహ్నంగా నిలుస్తోంది.



