Thursday, November 13, 2025
spot_img
HomeNorth ZoneDELHI - NCRతెలివైన డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా.. ఢిల్లీలో కలకలం!

తెలివైన డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా.. ఢిల్లీలో కలకలం!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు దర్యాప్తులో JeM మహిళా నెట్‌వర్క్‌లో ఫరీదాబాద్ మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ ప్రధాన పాత్రధారి అని గుర్తించారు. ఆమెను నవంబర్ 11న అరెస్ట్ చేశారు.

షాహీన్ JeM మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తూ, రాడికల్ ఆలోచనలు వ్యాప్తి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె సహచరులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ ఉ నబీల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె పాత్ర బయటపడ్డది. షాహీన్ లక్నోలో జన్మించి, ఎంబీబీఎస్, ఎండీ పూర్తిచేసి ప్రొఫెసర్‌గా పనిచేసింది. తాను డాక్టర్ హోదా ఉపయోగించి ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినట్లు దర్యాప్తు తేలింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments