జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లిలో గుప్తనిధుల వేట దారుణానికి దారి తీసింది. నవత అనే మహిళ ఇంట్లో నిధులు ఉన్నాయని నమ్మి మొగిలి, రాజేష్, సోమయ్యలు తవ్వకాలు చేపట్టారు.
తవ్వకాల సమయంలో మొగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, మిగిలిన ఇద్దరు ఘటన స్థలం విడిచిపెట్టారు.
మొగిలి కుటుంబ సభ్యులు ఇది నరబలి క్రమంలో హత్యగా ఆరోపించగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.
ఘటనాస్థలంలో తవ్విన గుంతలు, పూజాసామగ్రి స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల పేరుతో మోసపోవద్దని, ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు హెచ్చరించారు.
