ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్ పొన్నం సునీత – అనిల్ గౌడ్ గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామంలో *మహిళా సంఘం ఏర్పాటు విషయం గురించి సర్పంచ్ దృష్టికి దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ నిర్మించి ఉపయోగానికి తీసుకువచ్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం వార్డు సభ్యులకు కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో *ఉప సర్పంచ్ బూడిద కిషోర్, పంచాయతీ కార్యదర్శి అమీర్, వార్డు సభ్యులు గుంటి రామచంద్రం, సుదగోని పరశురాములు, దరిపల్లి రమ్య శ్రీ,బొజ్జ శ్రీనివాస్, సంధి లక్ష్మీ,సుధగోని అనూష, పోతుగంటి రమేష్, దుర్గం హైమ.
సొల్లు విజయనిర్మల తో పాటు మహిళా సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు, CA లు ,రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు, గ్రామంలోని 2 మహిళ సంఘాల నాయకులు* పాల్గొన్నారు
