నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రగతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందింది.
అయితే కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకున్నప్పుడు ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారు గొలుసు కనిపించకపోవడంతో సంచలనం రేగింది. ఆసుపత్రి సిబ్బందే చోరీకి పాల్పడ్డారన్న అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం మరింత అనుమానాస్పదంగా మారింది.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని విచారించి, సీసీ ఫుటేజ్ డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనతో నగరంలో తీవ్ర చర్చ నడుస్తోంది.






