హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల మధ్య మెట్రో రైలు ప్రయాణికులకు వరంగా మారింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) పెద్ద నిర్ణయం తీసుకుంది.
అత్యంత రద్దీ మార్గాల్లో నాలుగు కోచ్‌లు మరియు ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో మూడు కోచ్‌లతో 56 రైళ్లు నడుపుతోంది. ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్నందున ఢిల్లీ, ముంబై, బెంగళూరు మెట్రో మాదిరిగా సామర్థ్యాన్ని విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది రద్దీ తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.




