Saturday, November 15, 2025
spot_img
HomeSouth ZoneTelanganaయూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్|

యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్|

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌ 2025 ఫలితాలు విడుదల కాగా, తెలంగాణ అభ్యర్థులు అద్భుత ప్రతిభ చూపించారు. రాష్ట్రం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

పేద కుటుంబాల అభ్యర్థులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం “రాజీవ్ సివిల్స్ అభయ హస్తం” పథకం కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సాయం అందించింది.

ఈ పథకం ద్వారా 202 మందికి లబ్ధి కలిగించగా, వారిలో 43 మంది యూపీఎస్సీ మెయిన్స్‌లో విజయవంతమయ్యారు. ఇంటర్వ్యూలకు సిద్ధం కావడానికి మరో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments