Home South Zone Telangana ఒంటరి మహిళ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు – షాకింగ్ ఘటన |

ఒంటరి మహిళ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు – షాకింగ్ ఘటన |

0
1

జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడ్డీ వ్యాపారి లక్ష్మీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు కాళ్ల రామిరెడ్డిని అరెస్టు చేసి రూ.2.33 లక్షలు, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల్లో కూరుకుపోయిన రామిరెడ్డి, డబ్బులు చెల్లించేందుకు పరిచయస్తురాలు లక్ష్మీ వద్ద అప్పు కోరాడు. డబ్బు ఇవ్వలేదని ఆమె చెప్పడంతో, ఆమె మెడలోని బంగారంపై కన్నేసి హత్య చేశాడు.

దోచుకున్న నగలను కరిగించి రూ.4.66 లక్షలకు విక్రయించాడు. పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరా ఆధారాలు నిందితుడి నేరాన్ని బయటపెట్టాయి. ఈ ఘటనపై గద్వాల్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది.

NO COMMENTS