నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. మితిమీరిన వేగం, సడన్ యూటర్న్ తీసుకోవడం మూడు ప్రాణాలను బలి తీసుకుంది.
చేపలతో వెళ్తున్న కంటైనర్ లారీ ముందు బైక్ సడన్‌గా తిరవడంతో లారీ అదుపు తప్పి బైక్‌లను, పాదచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్లక్ష్య బైకర్ కారణమని నిర్ధారించారు. హైవేలపై సడన్ యూటర్న్‌లు, వేగం నియంత్రణ లేకపోవడం ప్రధాన కారణాలుగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.




