Home South Zone Telangana 5 ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామన్న మెయిల్ – హైదరాబాద్‌లో హై అలర్ట్ |

5 ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామన్న మెయిల్ – హైదరాబాద్‌లో హై అలర్ట్ |

0

దేశంలో మరోసారి ఉగ్ర బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటన తరువాత, హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఇండిగో కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్‌ రావడంతో హైఅలర్ట్‌ ప్రకటించారు.

అన్ని విమానాశ్రయాల్లో బాంబ్‌ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటల్స్‌, లాడ్జ్‌ల యజమానులతో సమావేశమైన అధికారులు CCTV కెమెరాలు, విజిటర్ రిజిస్టర్, ఐడీ ధృవీకరణ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ప్రజా భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version