తిరుమల TTD పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి, మాజీ AVSO సతీష్‌కుమార్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుంటకల్లు GRP ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన మృతదేహం తాడిపత్రి సమీప రైల్వే ట్రాక్‌పై లభించింది.
ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన ఆయనపై మరలా నోటీసులు జారీ అయ్యాయి. ఈ సందర్భంలో జరిగిన మృతిపై హత్యా లేదా ఆత్మహత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణి చోరీ కేసును వెలుగులోకి తెచ్చిన ప్రధాన సాక్షి కావడంతో రాజకీయ నేతలు పారదర్శక విచారణను డిమాండ్ చేస్తున్నారు.
