పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్టి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
చెడుగుట్లపల్లి మార్గంలోని నాగుల రాళ్లకు అభిషేకం చేసి, అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షిత్, కుమారస్వామి మహేష్ లు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, పరమశివుడు పార్వతీదేవి దర్శన భాగ్యం కల్పించి, వేద ఆశీర్వాదం చేశారు #కొత్తూరు మురళి .
