స్వామియే శరణం అయ్యప్ప… శబరిమల ఆలయం మండల పూజల కోసం తెరుచుకోగా, భక్తుల రద్దీ మొదలైంది. రోజుకు 90 వేల మందికి దర్శన అనుమతి ఇస్తున్నారు. వర్చువల్ క్యూలో 70 వేల టోకెన్లు, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల టోకెన్లు జారీ అవుతున్నాయి.
41 రోజుల మండల కాలం డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది. భక్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉండటంతో యాత్రామార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
18 వేల మంది పోలీసు సిబ్బంది నియమించగా, ఆలయ పరిసరాల్లో ఫోటోలు, వీడియోలు నిషేధించారు. ఆన్‌లైన్ బుకింగ్‌లు, ప్రసాద ఆర్డర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
