అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం భారీ ఎన్‌కౌంటర్ ఉద్రిక్తత రేపింది. పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో అగ్ర నాయకుడు హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
టైగర్ జోన్‌లో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూబింగ్ చేపట్టాయి. హిడ్మాపై రూ.1 కోటి, భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉండేది. దండకారణ్యంలో గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందిన హిడ్మా పలు భాషల్లో నైపుణ్యంతో ముఖ్య పాత్ర పోషించాడు.
