కర్నూలు : కర్నూలు జిల్లా…జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు క్రీడాకారులు.క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.డిసెంబర్ 27 , 28, 29 తేదీలలో హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 5వ జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఆర్చరీ నుండి 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 7 బంగారు పథకాలు.
6 సిల్వర్ పథకాలు, 10 కాంస్య పథకాలు సాధించారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసుకోవాలంటే చాలా కష్టతరమైన విషయం అని, గోల్డ్ మెడల్స్ సాధించిన వారిలో కర్నూలు కు చెందిన క్రీడాకారులు ఉండడం గర్వించదగ్గ విషయమని, ఇంకా అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఎన్.
వేణుగోపాల్ రెడ్డి, క్రీడాకారులైన తల్లిదండ్రులలో కర్నూల్ త్రీ టౌన్ ఎస్ఐ ఏ.పీ. శ్రీనివాసులు , కర్నూల్ డీఎస్పీ ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ మాధవి పాల్గొన్నారు.బంగారు పతకాలు పొందిన విద్యార్థులు (Gold Medal Students)విమల్స్కందన్మాధురిలలితభావేష్ప్రమోద్శ్రీజవెండి పతకాలు పొందిన విద్యార్థులు (Silver Medal Students)హోమితకృతికఅవంతికతన్‌వీర్ఈషితహుస్సేన్
