ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం రైతులకు,భూ యజమానులకు క్యూ ఆర్ కోడ్ తో ముద్రించబడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:
రైతుల క్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన థ్యేయం.
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి రైతుకు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకంపై రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి ముద్రలు మరియు చిత్రాలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది.
రైతు చేతికి వెళ్ళాక ఎటువంటి తప్పులు ఉండకుండా ఉండేలా ముందస్తుగానే ప్రభుత్వ సూచన మేరకు యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది.
వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న భుహక్కు భూ రక్ష పథకం పేరుతో భూములను రీసర్వే చేసింది.
రే సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతుల భూములకు సంబంధించి భూ హక్కు పత్రం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని పట్టాదారు పాసుపుస్తకం పై ముద్రించారు.
రి సర్వే లో అనేక లోపాలున్నా వాటిని సరిచేయకుండా వదిలేశారు.
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో భూ యజమాని చిత్రంతో, రాజముద్రతో అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు నుండి మండలాల వారీగా సభల్లో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,రెవెన్యూ అధికారులు,రైతులు,భూ యజమానులు,అభిమానులు,కార్యకర్తలు,మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…
