భారత వాతావరణ శాఖ (IMD) మిషన్ మౌసమ్ పథకం కింద వివిధ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 134 ఖాళీలలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ (I-IV), సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో MSC, BE/BTech కనీసం 60% మార్కులతో పూర్తి చేయాలి. సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్ధులకు ప్రాధాన్యం. వయసు పరిమితి 30–50 ఏళ్ళ వరకు.
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నవంబర్ 24, 2025 నుంచి డిసెంబర్ 14, 2025 వరకు చేసుకోవచ్చు. ఎంపిక స్క్రీనింగ్, అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్ణయించబడుతుంది. జీతం ₹29,200–₹1,23,100.
