Home South Zone Telangana ఎం.పి. చేతుల మీదుగా నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.|

ఎం.పి. చేతుల మీదుగా నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  చిల్కనగర్ డివిజన్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, ఈటల రాజేందర్ తో పాటు, శాసనసభ మాజీ సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, MBC కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ తడూరి శ్రీనివాస్.పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…

క్యాలెండర్ మన ఉనికికి చిహ్నం.
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు మనం గొప్పగా బ్రతికిన వాళ్ళం.
సమాజానికి నాగరికత అందించిన వాళ్ళం.
మిషన్లు వచ్చిన తర్వాత మనం ఆగమైపోయాము.

అయినా పట్టుదలతో చదువుకొని ఉద్యోగాలు సంపాదించి చాలామంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కులంలో ఉన్న పేదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, చదువుకు దూరంగా ఉన్నవారిని అక్కున చేర్చుకొని వారికి కావలసిన సాయం అందించాలని మీ అందరిని కోరుతున్నాను.

ప్రభుత్వం పట్టించుకున్న తర్వాత కూడా ఇంకా దీనమైన బ్రతుకులలో చాలా మంది ఉంటాయి.
మన సంఘం మన ఐక్యత అలాంటి కుటుంబాలకు మీరు ఒంటరి కాదు మేమంతా ఉన్నాము అని భరోసా కల్పించాలి కుటుంబ సభ్యులుగా వారిని ఆదరించాలని కోరుకుంటున్నాను.

స్మశాన వాటిక కావాలని కోరుతున్నారు.. జాగా ఉంటే నా వంతుగా ప్రయత్నం చేసి వాటిని కేటాయించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఆపద ఉన్నా, అవసరం ఉన్న మాలాంటి వారం మీ వెంట ఉంటామని తెలియజేస్తూ..  అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్, చిల్కనగర్ డివిజన్ ప్రెసిడెంట్ దత్తసాయి, ఫణిందర్, సంపత్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version