Home South Zone Telangana సజ్జనార్ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ—పోలీసుల విచారణ |

సజ్జనార్ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ—పోలీసుల విచారణ |

0
1

హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని వెల్లడించారు. ఆ ఖాతా ద్వారా “ఆపదలో ఉన్నాను… డబ్బులు పంపండి” అంటూ మోసపూరిత సందేశాలు పంపిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే ఒకరి నుంచి రూ.20 వేలు దోపిడీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇటువంటి మెసేజ్‌లు, లింకులు, వీడియో కాల్స్‌పై ఎవ్వరూ నమ్మకం పెట్టుకోవద్దని సజ్జనార్ హెచ్చరించారు. అనుమానాస్పద ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS