Home South Zone Andhra Pradesh సైబర్‌ నేరం: మేనేజర్‌ను నమ్మబలికి 18 లక్షల మోసం |

సైబర్‌ నేరం: మేనేజర్‌ను నమ్మబలికి 18 లక్షల మోసం |

0

సైబర్‌ నేరగాళ్ల పెత్తనం కొనసాగుతూనే ఉంది. ఒంగోలులో నివసిస్తూ చీమకుర్తి గ్రానైట్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే రాజును నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు.

ముంబయి పోలీసులమని నమ్మబలికి, అతని ఖాతా అసాంఘిక కార్యకలాపాలకు అనుసంధానమైందని బెదిరించారు. మనీలాండరింగ్‌, ఈడీ కేసులు పెట్టిస్తామని భయపెట్టి, మూడు విడతల్లో మొత్తం ₹18.35 లక్షలు వసూలు చేశారు.

చివరకు ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన రాజు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version