సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం ఆకునూరులో శెట్టె భాస్కర్ ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలడంతో పెద్ద మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపడ్డారు. భాస్కర్, తండ్రి అయ్యల్లం, భార్య కావ్య, ముగ్గురు పిల్లలు ప్రణవి, కృతిక, హర్షిణిలు మంటలకు చిక్కారు.
స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి కుటుంబ సభ్యులను బయటకు తీసి చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
