Home South Zone Andhra Pradesh విద్య–వైద్యంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం? |

విద్య–వైద్యంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం? |

0

కర్నూలు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ అధ్యక్షుడు పి ఎన్ అస్లాం
మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య వైద్యం దూరం చేస్తే సహించేది లేదని కర్నూలు జిల్లా వైయస్సార్ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు పిఎన్ అస్లాం అన్నారు బుధవారం కర్నూల్ నగరంలోని గౌరీ గోపాల్ ఆసుపత్రి

ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ దగ్గర పిఎన్ అస్లాం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మణి గాంధీ వైయస్సార్ కోడుమూరు నియోజవర్గ ఇన్చార్జి ఆదిములకు సతీష్ హాజరయ్యారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తే జరిగే అనర్థాల గురించి వివరించారు తీరును ఎండ కట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి అందులో ఏడు కాలేజీలను పూర్తి చేసి ఐదు కాలేజీలను ప్రారంభం చేసి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారని అయితే కూటమి ప్రభుత్వం వచ్చి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి తమ పార్టీ కి సంబంధించిన వారికి లాభం చేకూర్చేలా ప్రవేటికన చేయడం సిగ్గుచేటని అన్నారు

ఈ అన్యాయాన్ని సహించలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారని ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చి స్వతహాగా వారి సంతకాలు చేయడం ఆశించదగ్గ విషయం అని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిలిపివేయకపోతే కోటి సంతకాలసేకరణ చేసి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి తమ బండారాన్ని పెడతామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సంపత్ సురేంద్ర రెడ్డి ప్రసన్నకుమార్ మౌలాలి నెహెమియా లక్ష్మన్న ఖలీల్ బాషా మద్దిలేటి రామాంజనేయులు ముజీబ్ భాష మదర్ సాహెబ్ రవి ప్రతాప్ మధు సుధాకర్ నరసింహారెడ్డి మహేశ్వర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మోహన్ బాబు సంపత్ కుమార్ రషీద్ ప్రసాద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version