Home South Zone Telangana విధులకు ఆటంకం? కఠిన చర్యలు! – సజ్జనార్ |

విధులకు ఆటంకం? కఠిన చర్యలు! – సజ్జనార్ |

0

హైదరాబాద్ :  పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం బాధ్యుల‌పై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం.

గుర్తుంచుకోండి.. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి. క్ష‌ణికావేశంలో ఏ చిన్న‌త‌ప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి. — వీసీ. సజ్జనార్  IPS.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version