Home South Zone Telangana హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|

హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|

0

సికింద్రాబాద్  : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు నమోదైంది.
50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు RTGS చేస్తామని నమ్మించారు.
బాధితుడి నుంచి 50 లక్షలు తీసుకొని తిరిగి డబ్బు చెల్లించకుండా మోసం చేశారు.
ఆ కేసులో నిందితుడిపై నిఘా పెట్టాము.

హైదరాబాద్ వస్తున్నట్టు గుర్తించి వెంబడించాము.
శామీర్ పేట్ ORR నుంచి మహబూబ్ నగర వరకు నిందితుల్ని చేజ్ చేశాము.
మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సాయంతో అక్కడే పట్టుకున్నాం.
వారి వద్ద కారులో భారీగా డబ్బు గుర్తించాం. అది హవాలా డబ్బుగా తేల్చాం.

కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 4.05 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నాం.
ఈ డబ్బును నిందితులు గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించాం.
ఇద్దరు నిందితులు ప్రకాశ్ ప్రజాపతి(30), ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి(28)లను అరెస్టు చేశాం.

Sidhumaroju

Exit mobile version