Home South Zone Telangana మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |

మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా అల్వాల్ పోలీస్ స్టేషన్లో సంబరాలు అంబరాన్నంటాయి.  ఈ సందర్భంగా అల్వాల్ ఎస్హెచ్ఓ (SHO) ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఇతర పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు.

అనంతరం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో విధి నిర్వహణలో  అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో భాగంగా పోలీసు సిబ్బంది ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version