కర్నూలు !!
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు… జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు2025 జనవరి నుండి డిసెంబర్ 11 వ తేది వరకు 8,787 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు ఈ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను కూడా కట్టుదిట్టం చేశారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు రోజూ క్రమం తప్పకుండా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు , 1 నెల రోజుల పాటు జైలు శిక్ష ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
