Home South Zone Andhra Pradesh ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి |

ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి |

0

కర్నూలు :
కర్నూలు నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐర్ – సర్) ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు.
శనివారం ఆయన శ్రీ దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ హైస్కూల్ వద్ద బిఎల్వోలు నిర్వహిస్తున్న ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ..

భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, 2002 సంవత్సరంలో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ నాటి ఓటర్ల జాబితాను, ప్రస్తుతం ఉన్న 2025 ముసాయిదా ఓటర్ల జాబితాతో సరిపోల్చాలని ఆదేశించిందని, శని, ఆదివారాల్లో నియోజకవర్గంలో 20% కంటే మ్యాపింగ్ తక్కువ ఉన్న పోలింగ్ బూత్ కేంద్రాల్లో ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఓటర్ల వద్దకు బిఎల్వోలు వచ్చినప్పుడు సహకరించి, అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు.

Exit mobile version