Home South Zone Telangana భార్యను హత్య చేసిన భర్త… |

భార్యను హత్య చేసిన భర్త… |

0

మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన, మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం, ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

మృతురాలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బానోత్ రామన్న, స్వప్నలది గతంలో వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తర్వాత, కట్టుకున్న భర్త, బానోత్ రామన్న,  అత్త మామ, మరిది లకు ఆ వివాహిత, ఇష్టం లేకపోవడం తో గతంలో అనేకసార్లు భార్యాభర్తల మధ్య వచ్చిన ఘర్షణలు వచ్చినప్పుడు ఇద్దరు మధ్య సమస్య పరిష్కారం చూపి అత్తగారింటికి పంపించడం జరిగిందని స్థానికులు తెలిపారు.

అర్ధరాత్రి భర్త రామన్న, అత్త బుజ్జి, మామ కిషన్, మరిది నవీన్ లు స్వప్నల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, స్వప్నను తీవ్రంగా కొట్టినట్లు ఆమె శరీర భాగం నుజ్జు నుజ్జు అయిందని, దీంతో స్వప్న అక్కడికక్కడే మృతి నిన్ననీ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకొని స్వప్న మృతి దేహాన్ని మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు పేర్కొన్నారు మృతురాలకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు

NO COMMENTS

Exit mobile version