కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజి భరత్ పేర్కొన్నారు. అమర్ జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్లోని ఆయన విగ్రహానికి మంత్రి టీజీ భరత్ తో పాటు జిల్లా డాక్టర్ ఏ సిరి, గూడా చైర్మన్ శ్రీ సోంశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
