Home South Zone Andhra Pradesh ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

0

తేనె, వర్మి, ప్రకృతి సాగుతో ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌
ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి లో నైపుణ్యాభివృద్ది శిక్షణ

విజ‌య‌వాడ : ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఐదు రోజుల పాటు నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ తీసుకునేందుకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు సోమ‌వారం శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం అయ్యాయి.

ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో 3వ బ్యాచ్ కింద వెళ్లిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు 45 మందికి తేనె, వర్మి, ప్రకృతి సాగులో శిక్ష‌ణ ప్రారంభించారు. వీరిలో వ‌ర్మి కంపోస్టింగ్, నేచుర‌ల్ ఫార్మింగ్ లో 30 మందికి , తేనే త‌యారీ లో 15 మంది మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు.

ఎన్.ఐ.ఆర్.డిలో అపికల్చర్ టెక్నాల‌జీ సెంట‌ర్ కి చెందిన అధికారి ర‌వీంద్ర కుమార్ నేతృత్వంలో తేనెటీగల పెంపకం, తేనెటీగ జాతులు ప‌రిచ‌యం గురించి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హించారు. అనంత‌రం తేనేటీగ‌ల పెంప‌కానికి సంబంధించిన వ‌స్తువుల గురించి వాటి వినియోగం గురించి ప్రాక్టిక‌ల్ గా వివ‌రించారు. అలాగే వాటికి ఆహార తయారీ, ఫ్రేమ్‌ల శుభ్రపరిచే విధానం, సి.ఎఫ్ షీట్లు అమర్చడం, తేనెటీగల నిర్వహణ (హ్యాండ్లింగ్) పై శిక్ష‌ణ ఇచ్చారు.

అలాగే వ‌ర్మి కంపోస్టింగ్, నేచుర‌ల్ ఫార్మింగ్ శిక్ష‌ణ కి సంబంధించి వ్య‌వ‌సాయ నిపుణుడు జి.శేఖ‌ర్ నేతృత్వంలో
వర్మి కంపోస్టింగ్ సాంకేతిక‌త‌ పరిచయం, నేల పురుగుల (ఎర్త్‌వర్మ్) జీవచక్రం, సేంద్రియ వ్యర్థాల (ఇన్‌పుట్స్) ఎంపిక , ప్రదేశం ఎంపికల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం బెడ్డింగ్ మెటీరియల్ తయారీ , ప్రీ-కంపోస్టింగ్ పద్ధతులు, నేల పురుగుల హ్యాండ్లింగ్ విధానాలు, తేమ స్థాయిని కొలిచి విధానం పై శిక్ష‌ణ అందించారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యం సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

NO COMMENTS

Exit mobile version