పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే కారణంగా వినియోగించకపోవడంతో, ఆ ప్రాంతం పూర్తిగా చెత్తకుప్పగా మారింది. రోడ్డు మీదే మల–మూత్ర విసర్జనలు జరుగుతుండటంతో ఆ ప్రాంతం దుర్గంధంతో డంపింగ్ యార్డ్‌ను తలపించే పరిస్థితి ఏర్పడింది.
ఈ రహదారిని ప్రతిరోజూ S.F.S స్కూల్‌కు వెళ్లే చిన్నారులు నడక మార్గంగా వినియోగించాల్సి రావడంతో, చెత్త మురికి, దుర్వాసన కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో, చివరకు ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి దృష్టికి తీసుకువచ్చారు.
సమస్య తీవ్రతను గమనించిన వెంటనే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తక్షణమే స్పందించి, అధికారులను ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన శుభ్రత పనులు చేపట్టించారు. చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత, పిల్లలకు ఆటంకం కలగకుండా రోడ్డు సర్దుబాటు వంటి చర్యలు తీసుకుని 24 గంటల్లోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ప్రజల సమస్యలపై ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తూ, ముఖ్యంగా చిన్నారుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకునే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి నాయకత్వానికి ఇది మరో నిదర్శనం.
ఈ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
#Narendra
