Home South Zone Andhra Pradesh విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ...

విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు

0

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌
–4వ డివిజన్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌
+++++
 
        విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 
 
   మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో రేగుల అనురాధ∙మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పరిశీలించారు. 
 
 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీలో నూతనంగా అంగన్‌వాడీ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి రూ.35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్‌వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. చిన్నతనం నుంచే మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారు మంచి ఆరోగ్యవంతులుగా తయారు అవుతారనే మంచి ఉద్దేశ్యంతో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ చక్కటి మెనును సిద్ధం చేశారని చెప్పారు. పాఠశాలలోనే స్టోర్‌ రూమ్‌ను కూడా నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నామన్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నిధులు సమకూర్చుకుని పాఠశాలను మరింతగా అభివృద్థి చేస్తామని చెప్పడం అభినందనీయమనాన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు, నాయకులు పాతూరి సాంబశివరావు, వడ్లపట్ల గోపాలకృష్ణ, రాజేష్, చలసాని రమణ, యేర్నేని వేదవ్యాస్, కోనేరు రాజేష్, కోడూరు ఆంజనేయవాసు, సురేంద్ర, బత్తుల దుర్గారావు, గద్దె రమేష్, కార్పోరేషన్‌ ఈఈ సామ్రాజ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పి.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version