Home South Zone Telangana మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ |

మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ |

0

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని సీఐ రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీఐ రాజ్‌కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

ఈ ఫ్లాగ్ మార్చ్‌లో మరిపెడ సర్కిల్‌కు చెందిన ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొని గ్రామంలో పర్యటించారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version