Home South Zone Andhra Pradesh చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ |

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ |

0

Press Release

నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం

శనివారం అనకాపల్లిలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కు హాజరు

అమరావతి, డిసెంబర్ 18:* రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అవుతారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకుంటారు. శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.

NO COMMENTS

Exit mobile version