Home South Zone Andhra Pradesh 2026 ఫిబ్రవరి 5: AP BAC అమరావతి మహాసభ |

2026 ఫిబ్రవరి 5: AP BAC అమరావతి మహాసభ |

0

పత్రికాప్రకటన
తేదీ 18.12.2025

ఏపీ జే ఏ సి అమరావతి
(క్యాంప్ ఎట్ భీమవరం, పచ్చిమ గోదావరి జిల్లా) 2026 ఫిబ్రవరి 5వ తేదీ జరిగే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహా సభను జయప్రదం చేయండి…

ఏపీ జెఎసి అమరావతి ” *రాష్ట్ర మహా సభ”* కు స్వచ్ఛందంగా ఉద్యోగులు హాజరు కావాలి…ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పాలి… బొప్పరాజు

ది.05.02.2026 వ తేదిన ఏపి జేఏసి అమరావతి యొక్క *”రాష్ట్ర మహా సభ”* ను విజయవాడ పట్టణం లోని
తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నిర్వహించబోతున్న రాష్ట్ర
మహా సభకు రాష్ట్రములో గల 92 డిపార్టుమెంటు సంఘాలకు సంబందించిన సభ్యులు అందరు హాజకాబోతున్నారు.

ఈ మహసభకు సన్నాహకంగా విజయవాడ దగ్గరలోని జిల్లాల సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రాష్ట్ర చైర్మన్ గారు మొట్ట మొదటిగా ది.18.12.2025 వ తేది అనగా ఈ రోజు పచ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇతర రాష్ట్ర నాయకులుతో కలసి జిల్లా స్థాయి సమావేశము నిర్వహించారు.

ఈ సమావేశములో శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ముఖ్యముగా ప్రభుత్వము అనుసరిస్తున్న విధానములు, ఇటీవల గౌ||ముఖ్య మంత్రి గారు ఉద్యోగ సంఘములతో మనసు విప్పి మాట్లాడిన విషయములు అన్నియు తెలియజేసారు.
అందులో భాగంగా, గౌ||ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే ఆర్టి.సి ఉద్యోగులు వేలాది మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, అలాగే మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా వాడుకునేలా చారిత్రాత్మక ఉత్తర్వులు ఇటీవల జారీ చేశారని, వివిధ శాఖల్లో పనిచేసే అనేక మంది క్రింది స్థాయి ఉద్యోగుల పేర్లు (నామిన్క్లేచర్) కొంత కించపరిచే విధంగా ఉన్నందున అవన్నీ మార్పులు చేసేందుకు అన్ని శాఖాధిపతుల నుండి ప్రతిపాదనలు కోరుతున్నారని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో 60 రోజుల్లో వినియోగంలోకి తెచ్చేందుకు ఇప్పటికే మంత్రివర్యులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం అందులో మన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గా ఉన్న బొప్పరాజు గారిని కూడా ఒక మెంబర్ గా నియమించడం మన ఏపీ జేఏసీ అమరావతి కి సంతోషం అని, అలాగే గౌ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆన్లైన్లో ఒకేసారి వచ్చేలా మరియు జీ.పి.యఫ్/ఏపీ జి.ఎల్.ఐ లోన్లు, విత్డ్రయల్స్ అన్ని ఆన్లైన్లోన్ సేవలు అందించాలని నిర్ణయిస్తూ త్వరలో ఉత్తర్వులు రాబోతున్నాయని ఇవన్నీ గౌ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయని, ఆర్థిక పరమైన అంశాలపై కూడా రాబోయే రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని తెలిపారు.

మన ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి అందరు ఐక్యముగా కలసికట్టుగా ఉండాలని, ఐక్యముగా ఉండకపోతే ఏ ప్రభుత్వము కూడా మనలను గుర్తించదని, కావున ది.05.02.2026 (గురువారం) వ తేదిన ఏపి జేఏసి అమరావతి రాష్ట్ర మహా సభ తుమ్మలపల్లి కళక్షేత్రము, విజయవాడ నందు జరుగు సమావేశమునకు ఏ ఒక్కరు మిస్ కాకుండా హాజరు అవ్వాలని పిలుపునిచ్చారు.

అదేవిధముగా ఈ రోజు జరిగిన సమావేశములో పశ్చిమగోదావరి జిల్లా మెన్ మరియు మహిళా విభాగలను ఏర్పాటు చేయడము జరిగింది.

ఏపీ జేఏసీ అమరావతి, పచ్చిమ గోదావరి జిల్లా శాఖ;

1.శ్రీ వి.వి. సత్యనారాయణ, చైర్మన్, రెవెన్యూ శాఖ,

2.శ్రీ పవన్ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ, ఏపీ పీటీడీ డిపార్ట్మెంట్

2.శ్రీ యం. కనకారావు, ట్రెజరర్, ఆర్డబ్లీఎస్ డిపార్ట్మెంట్

*మరియు*

ఏపీజేఏసీ అమరావతి భీమవరం జిల్లా మహిళా విభాగం;

1.చైర్పర్సన్ గా శ్రీమతి డి. సుగుణ సంధ్య (రెవిన్యూ )

2.జనరల్ సెక్రటరీ గా శ్రీమతి బి. అరుణ (RTC)
కోశాధికారి గా శ్రీమతి ఐ. గంగారత్నం ( కొ ఆపరేటివ్ డిపార్ట్మెంట్ )
ఎన్నికయ్యారు

ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు;

టీవీ ఫణి పేర్రాజు గారు, అసోసియేట్ చైర్మన్, ఏపీజేఏసీ అమరావతి

శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి, సెక్రటరీ జనరల్ ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం

కొన ఆంజనేయకుమార్
Ap vros అసోసియేషన్ ప్రెసిడెంట్

S. మల్లేశ్వరరావు, ap క్లాస్ 4 ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్

శ్రీమతి జి. అనుపమ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ,Ap vros అసోసియేషన్.

శ్రీ గరికపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం.

NO COMMENTS

Exit mobile version