Home South Zone Andhra Pradesh మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది రవి నాయుడు

మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది రవి నాయుడు

0

తిరుపతి

రవినాయుడు, శాప్ చైర్మన్

మెడికల్ కళాశాలలపై వైసిపి అనవసర రాద్ధాంతం చేస్తోంది

పిపిపిపై గవర్నర్ ని కలిసిన జగన్ ఆయన అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు..?

కోటి సంతకాల సేకరణ మెుత్తం డ్రామా

పిపిపి విధానంపై జగన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన లేదు

అబద్ధాలకు ప్యాంటు, షర్టు వేస్తే అది జగననే

జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ రెడ్డి చెబుతున్నట్లు మొత్తం 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే కడుతున్నారు అని డప్పు వేసుకుంటున్నారు కదా?

జీవో నెంబర్లు. 107 మరియు108 తెచ్చింది జగన్ రెడ్డి మాత్రమే కదా?

మరి సదరు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం కడుతున్నప్పుడు, వాటిలో ఉన్న సీట్లు అయితే కేంద్ర కోటా (ఆల్ ఇండియా కోటా) లేకపోతే రాష్ట్రం కోటా, అనగా మిగిలిన సీట్లు మొత్తం రాష్ట్రంలో ఎంసెట్ లో వచ్చిన ర్యాంకుల ప్రకారం ఇవ్వాలి కదా?

అంటే, 15% సీట్లు అఖిల భారత స్థాయిలో ఇచ్చిన తరువాత, మిగిలిన 85% సీట్లు పేదలకు, అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి. అదికూడా కేవలం సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజు మాత్రమే చెల్లించాలి కదా?

మరి 85% మిగిలిన సీట్లలో 50% జనరల్ కేటగిరీ కింద, 35% సెల్ఫ్ ఫైనాన్స్ కోటా, 15% NRI కోటా కింద 15,000; 12,00,000 మరియు 20,00,000 రూపాయలు ఫీజు ఎందుకు నిర్దేశించారు జగన్ రెడ్డి గారు?

అఖిల భారత స్థాయిలో సీట్లు పోయిన తరువాత మిగిలిన మొత్తం 85% సీట్లు పేదలకు, అర్హులకు మాత్రమే కదా ఇవ్వాలి? ఎందుకు అంటే, వాటికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తున్నారు కాబట్టి? ప్రైవేట్ సంస్థలు లేవు కాబట్టి.

మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఎందుకు? అంతకన్నా ఘోరం ఏమిటంటే, NRI కోటా ఎందుకు పెట్టీ, సీట్లు అమ్ముకోవడానికి అనుగుణంగా జీవోలు ఇచ్చారు? మొత్తం సీట్లు పేదలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి పేదల కోసం ఎంతో కష్టపడ్డాడు అని భుజకీర్తులు వచ్చేవి కదా?

అంటే, మనం చేస్తే ఆది సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం ఎలా అవుతుంది? పోనీ మీరు తెచ్చిన జీవోలు ఏమైనా మార్పు చేర్పులు జరిగాయా? అలా జరిగితే, దాని పైన మాట్లాడాలి కదా? మరి ఎందుకు అవి మాట్లాడరు?

మీరు తెచ్చిన జీవోల ప్రకారం 100 లో 15 + 43 = 58 సీట్లు మెరిట్ ప్రకారం ఇస్తున్నారు. మిగిలిన 42 సీట్లు జగన్ రెడ్డి తెచ్చిన జీవోల ప్రకారం అమ్ముకోవటమే కదా? అంటే, పేదలకు 100లో 42 సీట్లు దూరం చేయడమే కదా? అంటే, 100 సీట్లులో 42 సీట్లు అమ్మకం పెట్టటం ప్రైవేటీకరణ అంటారా, లేక ప్రభుత్వం అమ్ముకోవడం అంటారా సొమ్ముల కోసం?

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్ రెడ్డి గారు? దీనికి ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. లేదు, సదరు జీవోలు కూడా నిజం కాదు,మా ప్రభుత్వం తెచ్చినవి కాదు, ఫేక్ అంటారా? పోనీ అదైనా చెప్పండి.

జిఓ 107,108పై చర్చకు మేము సిద్ధం

వైసిపి హయాంలో 17మెడికల్ కళాశాలలలో వందశాతం ఫ్రీ సీట్లు ఇచ్చామని జగన్ అబద్ధాలు చెబుతున్నాడు

ఎయిడెడ్ కళాశాలలను జగన్ అమ్మాలనుకున్నాడు

వైసిపి ముఖ్య నేతలందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆపరేషన్లు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చింది జగన్

బొత్స ప్రెస్ మీట్ అర్థం చేసుకోవచ్చు..కానీ జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు

జగన్ ప్యాలెస్ ను కట్టుకోవడానికి బదులు మెడికల్ కాలేజీని కట్టి ఉండొచ్చు

ప్రధాని హాజరైన యోగాను కూడా జగన్ విమర్సించడం కరెక్ట్ కాదు

వైసిపి హయాంలో ఆడుదాం-ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు దోచేశారు

జగన్ వీకెండ్ పాలిటిక్స్ మానుకోవాలి

జగన్ బెంగుళూరులోనే ఉంటే బాగుంటుంది

NO COMMENTS

Exit mobile version