ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
పత్రికా ప్రకటన* *తేదీ.20.12.2025
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా నేడు “OPPORTUNITIES IN ENVIRONMENT” కార్యక్రమం.
రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ గారు సూచనల మేరకు పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాది మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన
పెంపొందించడంలో
తమ పాత్రను పోషిస్తూ “వ్యక్తిగత & సమాజపరిశుభ్రత” సందర్భముగా ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లోను, ఏ.సి.పి. ఆఫీసుల్లోనూ, డి.సి.పి.ఆఫీసుల్లో, ఎస్.బి. సి.సి.ఆర్.బి. ఏ.ఆర్. ఆఫీసులలోని పరిసరాలను శుభ్రపరిచి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, నీటిపారుశుద్ధ్యం మరియు పరిశుభ్రత, మీ పరిసరాల్లో గల మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకొనుటకు తీసుకోవలసిన చర్యలు గురించి సిబ్బందికి తెలియపరచడం జరిగింది. అనంతరం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా తమతోపాటు, చుట్టుపక్కల వారికి కూడా నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాది మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన పెంపొందించడంలో తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
