పత్రికా ప్రకటన
*జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు*
*రాష్ట్రంలోనే సాయుధ దళాల పతాక నిధుల సేకరణలో గుంటూరు ప్రథమ స్థానం
*జిల్లాలో రూ.17,67,363 సేకరణ
గుంటూరు, డిసెంబరు 19 : సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుండి రూ.17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిల్లా కలెక్టర్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధి సేకరణలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు. సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలు అందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని అందుకు కారణం సైనికుల త్యాగాలు అన్నారు. సైనికులు కుటుంబాలను వదిలి పెట్టీ దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయింబవళ్ళు కాపాడుతున్నారని చెప్పారు.
దేశ రక్షణలో అసువులు బాసిన వీరజవానులు, వారి పై ఆధార పడిన వారి సంక్షేమం, మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువుల సంక్షేమంకు సహాయం అందించడం మన కర్తవ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్ లు,
జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల తదితరులు పాల్గొన్నారు.
