మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్ & ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో కళాశాల యాజమాన్యం వారు నిర్వహించారు . ఈ వేడుకలకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేదికపై విద్యార్ధినీ, విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్ లు, అకడమిక్ సర్టిఫికెట్ లను ఎమ్మెల్యే అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేసే అదృష్టం నర్సు ల రూపంలో మీకు వచ్చిందని, హాస్పటల్స్ లో మీది తల్లి పాత్ర వంటిదని, మీ సేవల ద్వారా ప్రజలకు ఆత్మీయులుగా మారి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.
పేద, మధ్యతరగతి విద్యార్ధినీ , విద్యార్ధులకు అందుబాటులో మంచి విద్యని అందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రా రెడ్డి, డాక్టర్ కృష్ణా రెడ్డి, శ్రీమతి మేఘనా రెడ్డి గార్లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షైనీ జాన్, స్కూల్ హెడ్ విజిత వాణి, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్ లు పాల్గొన్నారు.
#Sidhumaroju
