మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్ ఉన్నత పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ కోసం మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు.
ఈ సర్వే కార్యక్రమంలో ఆర్మీ విభాగానికి చెందిన డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వెంకన్న సిబ్బంది, మండల రెవెన్యూ కార్యాలయానికి చెందిన సర్వేయర్ అన్నపూర్ణ మరియు ఇతర సిబ్బంది పాల్గొని పాఠశాల స్థల సరిహద్దులను పరిశీలించారు. సర్వే పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలతో నివేదిక (రిపోర్ట్)ను త్వరలో అందజేస్తామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు సంబంధించి ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టత తీసుకురావడం ద్వారా విద్యార్థులకు భద్రతతో కూడిన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ మురళీకృష్ణ, పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
