Home South Zone Andhra Pradesh కేఎల్ యూనివర్సిటీ గుంటూరు యువజన ఉత్సవాలు ముగింపు |

కేఎల్ యూనివర్సిటీ గుంటూరు యువజన ఉత్సవాలు ముగింపు |

0

KL యూనివర్సిటీ గుంటూరులో యువజనోత్సవల ముగింపు వేడుక సందర్భంగా..

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

– భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే

– స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణయం.

– యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు తోడ్పడతాయి.

– యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకోవాలి, మంచి పనులు చేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలి.

– ఈ తరహా కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలి.

– రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుంది .

– ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఎంతగానో బాధపడ్డం రాజధాని లేదని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారు.

– గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనం, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగనుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తాం.

NO COMMENTS

Exit mobile version