ప్రెస్ నోట్ తేదీ 20/12/2025 విజయవాడ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అపాలి.
పీపీపీ పేరుతో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి.
—జానకిరాములు రేవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (Public Private Partnership) పద్ధతుల్లో ప్రయివేట్ పరం చేయడం అనేది ప్రజల ఆరోగ్య హక్కుపై చేసిన ప్రత్యక్ష దాడి అని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 107 108 ని రద్దు చేయాలని నేటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఈ ముగ్గురు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పదేపదే ప్రజలను రెచ్చగొట్టడం జరిగిందన్నారు.
ఇప్పుడు 590 జీవో తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో వైద్య విద్యను దోపిడీ చేయాలన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలకు జీవించే హక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యగా మేము ఖండిస్తున్నాం. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వారి గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వం అణచివేసే వ్యహరించడం జరుగుతుందని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం తక్షణం 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలో నిర్మించాలని దీనికి 5000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం కార్పొరేట్ ఆసుపత్రుల లాభాల కోసం తీసుకున్న ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందించే కేంద్రాలని, వాటిని ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం సామాజిక న్యాయంపై దాడి అని అన్నారు. పీపీపీ విధానంతో వైద్య విద్య పూర్తిగా వ్యాపారంగా మారి, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడం ద్వారా సామాన్య కుటుంబాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు.ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోవడమేనని, ఇది రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కును కాలరాయడమే అని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటిని బలహీనపరచే విధానాలు అమలు చేయడం దారుణమని మండిపడ్డారు. అలాగే ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు ఆర్ వై ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఓబులేసు మాట్లాడుతూ.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పేద, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి రూ.6,500 ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం తీవ్ర అన్యాయం అన్నారు.పేద విద్యార్థుల చదువు కొనసాగేందుకు కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం కాలానుగుణంగా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు.
కళాశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం, హాల్టికెట్లు నిలిపివేయడం, పరీక్షలకు అనుమతించకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కాలేజిల యాజమాన్యం యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేవిధంగా ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరారు. అదేవిదంగా ఎన్నికల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం.
అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను విస్మరించడం దారుణమని విమర్శించారు. రూ.7,500 ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆర్ ఎస్ పి నాయకులు తిమ్మాక్క, ప్రేమ్. శ్రీనివాసులు నరేంద్ర,హరి,గోపి ప్రేమ్ కుమార్, సోము, తిమ్మప్ప,మురళి.నరసింహారావు అశోక్, రాము,తదితరులు పాల్గొన్నారు.
అభినందనలతో…
జె. జానకిరాములు
ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ.
