గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన… శ్రీకృష్ణ కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే రాముకు… ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్తులు
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన యాదవ సంఘ పెద్దలు…
ఐక్యంగా ముందుకు సాగితే ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయవచ్చు…..
గుడివాడకు ఏం కావాలి…. ప్రజలకు ఏం చేయాలో అన్న వాటిపైనే నా దృష్టి అంతా…
నందివాడ డిసెంబర్ 20: నా వద్ద ఈర్ష ద్వేషాలకు తావు లేదని, గుడివాడ అంతా నా కుటుంబంతో సమానమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఊరికి ఏం కావాలి…. ప్రజలకు ఏం చేయాలో అన్న అంశాలపైనే దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు.
నందివాడ మండలం కుదరవల్లి దాతల సహకారం రూ.10 లక్షల నిధులతో గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ కమ్యూనిటీ హాల్ భవనాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు… గ్రామ మాజీ సర్పంచ్ మసిముక్కు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.
కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ అనంతరం మొదటి కార్యక్రమంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం దైవ సేవకులు, కూటమి నాయకులతో కలిసి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము… విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…. 10 లక్షల నిధులతో అందరికి ఉపయోగపడేలా అత్యద్భుతంగా కమ్యూనిటీ హాల్ నిర్మించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కమ్యూనిటీ హాల్ ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాయకత్వ లక్షణాలతో పదిమందిని కలుపుకొని ముందుకు సాగితే…మంచి పనులు చేయవచ్చనీ, కుదరవల్లి గ్రామస్తులు నిరూపించారన్నారు. మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తున్నానన్నారు.
ప్రజలతో పాటుగా టిడిపి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే రాము….తాను ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని అందరిని సొంత వాళ్ళగానే భావిస్తానని ఉద్ఘాటించారు కూటమి శ్రేణులకే కాకుండా ప్రజలకు సహాయం చేసేందుకు తాను అనునిత్యం ప్రయత్నిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కెల్లా సత్యనారాయణ ,కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అల్లాడ చంద్రమౌళి,నాయకులు గుజ్జుల మోజేష్ నక్క శీను, రాధాకృష్ణ ,సీతయ్య,యేసు పాదం,సాయి, గంగరాజు,తోట వెంకటేశ్వరరావు,బుసన బోయిన జగన్మోహన్రావు,మీగడ ప్రేమ్ కుమార్, నేరుసు నాగరాజు, లోకేష్ ,నేరుసు కాశి, లోయ విజయ్, జనసేన నాయకులు కొలుసు రాజా, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
