23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు
ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో .
వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో.
షుగర్, దంత, నేత్ర, డైటీషియన్ ఉచిత పరీక్షలు
విజయవాడ,డిసెంబర్ 20.
ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రజా ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన కృష్ణాజిల్లా ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మ తల్లి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, నేత్ర, దంత, డైటీషియన్ పరీక్షలు నిర్వహిస్తారని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ మోహన్ డయాబెటిస్ సెంటర్ వారు ఈ ఉచిత పరిక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
