అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు. సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.1 లక్ష విరాళం అందించిన కందుల సాయిని భువనేశ్వరి గారు అభినందించారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి భువనేశ్వరి గారు థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sivanagendra
