గద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన గద్దె అనురాధ , ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టబాబులకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
టిడిపి పట్ల అంకితభావం, ప్రజాసేవలో అనుభవం కలిగిన గద్దె అనురాధ , చెన్నుబోయిన చిట్టి బాబు వీరి నియామకం ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయటానికి దోహదపడుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తుందని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశంపార్టీ తొలి మహిళ అధ్యక్షురాలిగా నియమితులై గద్దె అనురాధ చరిత్ర సృష్టించారని కొనియాడారు. గద్దె అనురాధ నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతంగా తయారు చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కు గద్దె అనురాధ, చిట్టిబాబులను అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా నియమించినందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానంకు, టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
