Home South Zone Andhra Pradesh పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్ |

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్ |

0

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
-ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు.

ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పల్స్ పోలియో వంటి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2015 వ సంవత్సరం తర్వాత మన దేశంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయని అందువల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. మన పిల్లలే మన ఆస్తి అని వారిని ఆరోగ్యవంతులుగా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. పల్స్ పోలియోతో పాటు టీకాలు కూడా పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

కార్యక్రమంలో కార్పోరేటర్
పొట్లూరు సాయిబాబా,పాతూరి సాంబశివరావు,నాదర్ల రాజేష్,కరీమ్, శాయినా బుజ్జి, రెడ్డి రాంబాబు,పోతురాజు, అయ్యప్ప రెడ్డి, కలామ్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version